రాజకీయ చదరంగంలో ‘అమరావతి’ ఉద్యమం
పాలకులకు ఓటుతో అధికారం ఇస్తారు. పాల కులు ప్రాంతాలు, సామాజిక సమీ కరణల సమతూకం పాటిస్తూ అభి వృద్ధిని వికేంద్రీకరించాల్సిన అవ సరం ఉంది. అన్ని ప్రాంతాల వృద్ధి తోనే సామాజికాభివృద్ధి, రాష్ట్రాల అభివృద్ధి ముడిపడి ఉంది. ముఖ్య మంత్రి జగన్‌మోహన్ రెడ్డి మూడు రాజధానుల లక్ష్యం కోసం చేస్తున్నారా! రాజకీయ కక్షతో చేస్తున్నా రా! అనే చర్చ జరుగుతుంది.

ప్రాంతాల సామాజిక అభివృద్ధి కోసమే అని అధికారపక్షం అంటే కాదు,కాదు తెలుగుదేశం పార్టీని అణగదొక్కడం కోసమే అని ప్రతిపక్షం అంటుంది. మూడు ప్రాంతాలు మూడు రాజధానులు. శాసన రాజధాని అమరావతి, కార్యనిర్వహక రాజధాని విశాఖపట్నం, కర్నూలు న్యాయ రాజ ధానులుగా తీర్మానించారు. వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వాలు, ప్రతిపక్షాలకు మధ్య అవగాహన అవరోధం ఉన్నప్పుడు ఒకరి దృష్టిలో ఒకరు పిచ్చోళ్లు అవ్ఞతారు.కృష్ణా,గుంటూరు జిల్లాల్లో పాక్షిక వ్యతిరేకత మాత్రమే ఉంది. ఈ రెండు జిల్లాల్లో 29 గ్రామాల్లో ముప్ఫైనాలుగు వేల ఎకరాలు, మూడు పంటలు పండే భూములు రైతుల వద్ద తీసుకోవడంతోనే ఆనాటి ప్రభుత్వానికి దురుద్దేశం ఉందని చాలా విమర్శలు వచ్చాయి.
కొందరు రైతులు నెత్తినోరు మొత్తుకొని భూములు ఇవ్వమని, మా ఉపాధి భుక్తి పోతుందని వాపోయారు. పర్యావరణవేత్తలు మేధావ్ఞలు నాటి ప్రభుత్వ తీరుని విమర్శిస్తూ రైతులకు అండగా నిలబడ్డ సందర్భం కూడా ఉంది. కాని నాడు భూములు ఇవ్వమని మొత్తుకున్నవారే, కొందరి ప్రోత్సహంతో నేటి ఉద్యమంలో ముందుంటున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణ యానికి ప్రజలు నీరాజనం పడుతున్నారు.
రాజధాని వికేంద్రీకరణ ఒక అంశం మాత్రమే. దానికన్నా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఉద్యోగ, ఉపాధి, జీవన ప్రమాణాలు పెంచాలి. బిల్డింగులు మాత్రమే కనపడితే భూముల రేట్లు మాత్రమే పెరిగి మాఫియా పెరగటానికి అవకాశం ఉంటుంది. ప్రాంతాలవారీగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అప్పుడే వెనుకబడ్డ ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. చంద్రబాబు నాయుడు అమరావతిని రియల్‌ఎస్టేట్ రంగుల ప్రపంచం చూప డంతో ఇప్పటివరకు ఉన్న భూములకు,బినామీలతో కొన్న భూము లకు ఆకాశాన్నంటే ధరలు కోల్పోతున్నామనే నిరాశ నిస్పృహలతో అక్కడి ప్రజలు అమరావతి ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముఖ్య కారణమైంది.
స్వార్థం, రియల్ ఎస్టేట్ వ్యాపార కారణాలతోనే ‘ఆస్తుల కోసం ఆరాటం.. అమరావతి పోరాటం సాగుతుంది. అని అధికారవర్గాల వాదన, అమరావతి శాసన రాజధాని, విశాఖపట్నం కార్యనిర్వహక రాజధాని,న్యాయ వ్యవహారాల రాజధాని కర్నూల్‌గా పాలన వికేంద్రీకరణ విధానానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి. ఈ అంశాన్ని శాసనసభలో ఆమోదించిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో కొందరు చర్చను రచ్చగా మార్చారు.
ఉద్యమం అంటే అన్యాయం జరిగిన వాళ్లు ప్రభుత్వాన్ని కన్వెన్స్ చేసి సమ స్యని పరిష్కరించుకోవాలనుకుంటారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం తీవ్ర భావోద్వేగంతో జరిగినప్పటికీ తిట్ల దండకాలు లేకుండా తెలంగాణ ఎందుకు కావాలో పుంకానుపుంకా లుగా ప్రజలకుచెప్పి తెలంగాణాను సాధించడం జరిగింది. రాజ కీయ దురద్దేశం, ఆవేశం, ఉక్రోశంతో ఉన్న ఉద్యమాలు నీటిమీద రాత మాదిరిగా ఉంటాయి.అవి చరిత్రలో కనబడవ్ఞ.ఒక్క అమరా వతిలోనే రాజధాని ఉంచాలనే వారివాదన సరైందికాదు.గత ప్రభు త్వంలో ఆధిపత్యకులాల వారి రియల్‌ఎస్టేట్ వ్యాపారంతో ముడి పడి ఉందని గణాంకాలు చెబుతున్నాయి.
అమరావతిలో ఆస్తుల రక్షణకోసం,భూముల రేట్లకోసం హఠాత్తుగా కోటీశ్వరులు కావాలనే అత్యాశే స్ఫూరిస్తుంది. జగన్ దృష్టిలో పెట్టుకోవలసిందల్లా ఉపాధి, భుక్తి కోల్పోయిన వాళ్లను మాత్రమే. ఇది ఉసిగొల్పే ఉద్యమమే కానీ కసితో చేసే ఉద్యమంకాదు. ఆస్తుల కోసం ఆరాటమే కానీ అమరావతికోసం పోరాటంకాదు. అమరావతి రాజధాని కావలనటం లో తప్పులేదు. మరెక్కడా వద్దు అనటంలోనే రాజకీయ డ్రామా దాగి ఉంది.
మూడు ప్రాంతాల సామాజిక రాజకీయ అభివృద్ధి కేంద్రీకృత పాలనకు భిన్నంగా సాగాలని, ప్రాంతాల వారీగా రాజధాను లుంటూనే సమన్యాయం, సహజన్యాయం, సామాజిక న్యాయం జరుగుతుందని సంకల్పించారు.ఉత్తరాంధ్ర, రాయలసీమ ల్లోకూడా రాజధానులుగా విశాఖ, కర్నూలు ఉంటాయని ప్రకటిం చడంతో హర్షం వ్యక్తమవ్ఞతుంది. చంద్రబాబుకు ఎన్నికలకు ఆరు నెలల ముందుసంక్షేమం, అభివృద్ధి గుర్తుకువస్తే జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మెజార్టీ ప్రజలను ప్రభావితం చేసే అమ్మఒడి, ఇంగ్లీష్ విద్య, రైతుల రుణమాఫీ, ఆటో కార్మికులకు ఆర్థిక ప్రయోజనం లాంటి జనాదరణ కార్యక్రమాల దూకుడుని రాజకీయంగా ఎదుర్కోలేక అమరావతిని అందివచ్చిన అవకాశంగా అడ్డం పెట్టుకున్నట్లు వాదనలున్నాయి.
కాలయాపనకే సెలెక్ట్‌కమిటీ
కాలయాపనకే సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. మూడు రాజధానులు ఆపలేమని నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు నైతిక విరుద్ధంగా సెలెక్ట్ కమిటీ పన్నాగం పన్నారు. సెలెక్ట్ కమిటీ అంటే? చట్టసభలలో ఒక విషయంపై లోతుగా చర్చించాలను కుంటే వెంటనే ఎవరైనా ఒక సభ్యుడు నోటీసు ఇవ్వొచ్చు. స్పీకర్ వివిధ పార్టీల నుండి కొంత మంది సభ్యులతో కూడిన కమిటీ వేస్తారు. ఈ కమిటీకి మూడు నెలల కాలపరిమితి ఉంటుంది.
ఈ కాలంలో ఆమోదం, తిరస్కరణ ఏ విషయం తేల్చి చెప్పకపోతే బిల్ ఈజ్ పాస్. కాని అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్‌లో లేటుగా నోటీసు ఇవ్వడంతో ఇది చెల్లకపోవడంతో కౌన్సిల్ స్పీకర్ తనుకున్న విచక్షణ అధికారంతో సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించి సత్సంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చారు. రెండవసారి కౌన్సిల్‌కు ఈ బిల్లుని తిరిగి పంపిస్తే నెలరోజుల్లో తిరిగి పంపించాలి. మూడు నాలుగు నెలలు మాత్రమే ఆగే అవకాశం ఉంది.
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తొంభైతొమ్మిది శాతం అడ్డుపడదు. కేంద్రప్రభుత్వం ఎప్పుడు వ్యవస్థాగతంగానే పనిచేస్తుంది. దీనివల్ల వారికి వచ్చిన ఇబ్బంది ఏమీలేదు. అడ్డుపడే అవకాశం లేదు. ప్రతిపక్షనాయకులవి పొలిటికల్ స్టేట్‌మెంట్స్ మాత్రమే. ఒకవేళ కేంద్రం జోక్యం చేసుకుంటే ముఖ్యమంత్రుల పాలనాధికారంలో జోక్యమే అవ్ఞతుంది. కేంద్రం దేశవ్యాప్తంగా అబాసుపాలవ్ఞతుంది.
-సాధం వెంకట్, సీనియర్ జర్నలిస్టు
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/