క్రీడ‌ల నుంచి సైన్స్ వ‌ర‌కు, దేశాన్ని మ‌హిళ‌లు గ‌ర్వంగా నిలుపుతున్నారుః రాష్ట్ర‌ప‌తి ముర్ము

Let’s Remove Remaining Hurdles From Path Of Young Women: President

న్యూఢిల్లీ: రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఆమె త‌న ఎక్స్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు. యువ మ‌హిళ‌ల మార్గంలో ఉన్న అవ‌రోధాల‌ను తొలిగించాల‌ని, వారికి స్వేచ్చ‌ను ఇవ్వాల‌ని ఆమె దేశ ప్ర‌జ‌ల్ని కోరారు. నారీ శ‌క్తిని సంబ‌రంగా జ‌రుపుకునే అవ‌కాశం ఇదే అన్నారు. మ‌హిళ‌లు సాధించిన ప్ర‌గ‌తి ఆధారంగానే స‌మాజ ప్ర‌గ‌తిని కొల‌వ‌గ‌ల‌మ‌ని ఆమె అన్నారు. అన్ని రంగాల్లోనూ భార‌తీయ మ‌హిళ‌లు అద్భుతంగా రాణిస్తున్నార‌ని, క్రీడ‌ల నుంచి సైన్స్ వ‌ర‌కు, దేశాన్ని వాళ్లు గ‌ర్వంగా నిలుపుతున్నార‌ని ముర్ము పేర్కొన్నారు.