యూసుఫ్ గూడలో దారుణం..టీవీ షోల్లో చాన్స్‌ల పేరిట యువతిపై లైంగిక దాడి

సినిమా ఛాన్సులు ఇస్తామని నమ్మబలికి అమాయకపు యువతుల బ్రతుకులను ఆగం చేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. వెండితెరపై , బుల్లితెర ఫై కనిపించాలని చాలామంది యువతీ , యువకులు కోరుకుంటారు. అందుకోసం స్టూడియో ల చుట్టూ ప్రతి రోజు తిరుగుతూ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ అందర్నీ అడుగుతుంటారు. ఇలాంటి వారిని క్యాష్ చేసుకొని కొంతమంది మోసం చేస్తుంటారు. యువకులకు సినిమా ఛాన్సులు ఇప్పిస్తామని చెప్పి వారి నుండి డబ్బులు లాగుతుంటారు. ఇక అమ్మాయిలనైతే శారీరకంగా వాడుకుంటుంటారు.

తాజాగా యూసఫ్ గూడ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. టీవీ షోల్లో చాన్స్‌ల పేరిట యువతిపై లైంగిక దాడి చేసాడు. డెమో కోసమని ఓయో రూమ్‌కు తీసుకెళ్లి మేకప్ ఆర్టిస్ట్ అత్యాచారం చేశాడు. తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి లొంగదీసుకున్నాడు. మరో అమ్మాయితో కలిసి సదరు యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.