జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సిఎం జగన్

అమరావతి: సిఎం జగన్ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా టీచర్లకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు జగన్ ట్విటర్‌లో పేర్కొన్నారు. విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ విద్యా హక్కును అందించాలన్న తమ లక్ష్య సాధనలో ఉపాధ్యాయులే మార్గదర్శకులుగా తమ ప్రభుత్వం విశ్వసిస్తోందని సిఎం అన్నారు. భావి పౌరులకు విద్య, విజ్ఞానాన్ని అందించి సరైన దిశానిర్దేశం చేయడం ద్వారా జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తున్నారని సిఎం గుర్తు చేశారు. నైతిక విలువలే పునాదులుగా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేని అన్నారు. ‘గురువును దైవంగా పూజించే సంప్రదాయం భారతదేశానిది. విద్య, వివేకం, విలువలు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురువులకు వందనం’ అని సిఎం జగన్ అన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/