ఫ్యాషన్‌గా కనిపించే లేయర్ జ్యుయెలరీ
కొత్త వెరైటీలు
నగల్లో సరికొత్త ట్రెండ్లు నిరంతరం పుడుతూనే ఉంటాయి. వాటి ఆదరణ కూడా అలానే సాగుతూ ఉంటుంది. ఇలా చెప్పుకునే వాటిల్లో లేయర్ జ్యువెలరీ ఒకటి. ఈ తరహా స్టయిల్లో నెక్లెస్‌లు, ఉంగరాలు ఉన్నాయి.
వేర్వేరు పొడవులతో ఉన్న గొలుసులను ఒక దాని కింద ఒకటిగా అమర్చి తయారుచేసే ఈ రకం నెక్లెస్ మెడలో నిండుగా కనిపిస్తుంది.
సన్నటి చెయిన్లే అయినా అయిదు లేదా ఆరు ఉండటం వల్ల భారీ లుక్ కూడా వస్తుంది.
నాలుగు వరుసలను కలుపుతూ ఒక వైపు పెద్ద పెండెంట్ ఉన్నవి సరికొత్త ఫ్యాషన్. వేడుకల్లో ఈ రకం నగ పట్టు చీరలు, ఫ్యాన్సీచీరలు రెండింటికీ బాగుంటుంది.
లేయర్ బ్యాంగిల్స్ ఇది కూడా కొత్త ట్రెండే. పెద్ద సైజు మొదలుకుని చిన్న సైజు వరకు మోచేతి దిగువ నుంచి ముంజేతి వరకు ధరిస్తే దాన్నే లేయర్ బ్యాంగిల్ స్టయిల్ అంటారు.
ఇందుకు మధ్యస్తంగా ఉండే గాజులు ఎంచుకోవాలి.
అన్ని గాజులూ ఒకే రకంగా ఉండాలి. రాళ్లు పొదిగినవయితే అన్నీ అవే ఉండాలి. సాదా గాజులైనా అన్నీ అవే గాజులుండాలి. లేయర్ బ్యాంగిల్స్టీనేజీ అమ్మాయిలకు చక్కగా నప్పుతాయి.
గాజులు వేసుకోవటానికి ఇష్టపడని వాళ్లు లేయర్ బ్రెస్‌లెట్స్ వేసుకోవచ్చు. ఫ్యాన్సీ డ్రెస్‌లకు బాగా సూటవుతాయి.
ఒకే చేతికి వేసుకునే ఈ బ్రేస్లెట్లు మోకాళ్లవరకు ఉండే స్కర్ట్లు, మినీలు వేసుకునే వాళ్లకు బాగుంటాయి.
వేలి ఉంగరాలు నాలుగైదు కలిపి పెట్టుకుంటే చేతికి అందమొస్తుంది.
ఒకే ఒక భారీ ఉంగరం బదులు ఇలా సైజులవారిగా ఉంగరాలు ధరించటం లేటెస్ట్ ఫ్యాషన్. ఆధునికం లేదా సాంప్రదాయం ఎలాంటి వస్త్రధారణకైనా ఈ రకం ఉంగరాల స్టయిల్ బాగుంటుంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/