సమస్యలతో సగటు ఉద్యోగి సతమతం

ఉద్యోగుల జీతాల్లో కోత

Employees salaries

ఒక వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు లాక్‌డౌన్‌ సమయంలో జీతాలకు ఎటువంటి కోతలు విధించకుండా మొత్తం జీతం చెల్లించాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తే అదే బాటలో ప్రైవేటు సంస్థలు కూడా నడుస్తాయి. అందువల్ల సగటు ఉద్యోగి జీవితం అస్తవ్యస్తమవుతుంది.

ఇప్పటికే కొన్ని ప్రైవేట్‌ కంపెనీలు, విమానయాన సంస్థలు, టైర్ల కంపెనీలు ఉద్యోగుల జీతాలలో కోతలు విధిస్తున్నాయి కరోనా వైరస్‌ కట్టడిలో ఉద్యోగులు కృషి చేస్తున్నారు.

ఈ తరుణంలో వారికి బాసటగా నిలవాల్సిన ప్రభుత్వం జీతాలలో కోతలు విధించి ఆర్థిక ఇబ్బందులకు గురి చేయటం తగదు.

క రోనా ప్రభావం తెలుగు రాష్ట్రాలలో పనిచేసే ప్రభు త్వ ఉద్యోగుల జీతాలపై పడింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం విడ తల వారీగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని యోచన చేస్తుండగా, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా జీతాల్లో కోత విధించాలని చూస్తోంది.

లాక్‌డౌన్‌ను అమలు చేయడం వల్ల దాని ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడిందని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తన దగ్గరున్న నిధులను కరోనా వైరస్‌ నిరోధానికి ఖర్చు పెడుతోందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద ఉద్యోగుల వేతనాల్లో యాభై శాతం కోత విధించడానికి సిద్ధమవ్ఞతున్నట్లు తెలుస్తోంది.

కరోనా వైరస్‌ ప్రభావం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపిందని, ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం వేతనాల చెల్లింపులపై కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్న ట్లు తెలుస్తోంది.

మొత్తం మీద యాభై శాతం వరకు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తున్నట్లు అర్థమ వ్ఞతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి చర్యలే తీసుకుంటున్నది.

అందులో భాగంగా మార్చి నెలలో ప్రజాప్రతి నిధుల వేతనాల్లో 65శాతం, ఏ గ్రేడ్‌, బి గ్రేడ్‌ అధికారుల జీతాల్లో 50 శాతం, సి గ్రేడ్‌ ఉద్యోగుల జీతాలలో 20 శాతం కోత విధిస్తున్నట్లు తెలుస్తోంది.

అప్పులు తీర్చే సంద ర్భంలో కూడా కోర్టులు ఉద్యోగి జీతం నుండి మినహాయింపులు మొత్తం జీతంలో మూడవవంతు దాటరాదని కుటుంబపోషణ నిమిత్తం మిగిలిన దానిని వదలి వేయాలని తీర్పులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

అయితే సగం జీతం మాత్రమే ఎలా ఇస్తారని ప్రభుత్వ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యో గుల జీతాలు కోతలు విధించే విధమైన ఆర్థిక అత్యవసర పరి స్థితి ఇప్పుడు మనదేశంలో లేదని,ఉద్యోగుల జీతాలు ఎటువంటి కోతలు విధించకుండా చ్లెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు.

యాభైశాతం జీతాల్లో కోతలు విధించే పరిస్థితి మన దేశంలోని మిగిలిన ఏ రాష్ట్రాలలో లేదని, కేవలం తెలుగు రాష్ట్రాలలోనే ఈ పరిస్థితి ఎందుకని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

కేవలం ఈ ఇరవై ఒక్క రోజుల లాక్‌డౌన్‌ ప్రభావం వల్ల ఆర్థిక పరిస్థితి కుదేలు అయ్యే అవకాశమే లేదని, గతంలో కూడా ప్రపంచ ఆర్థిక మాంద్య(1920-30) సమయంలో కూడా భారతదేశ సంప్రదాయ ఆర్థిక వ్యవస్థను పెద్ద ప్రభావితం చేయలేదు.

కేవలం జాబ్‌,బొగ్గు పరిశ్రమల మీద మాత్రమే ప్రభావం పడింది. కాబట్టి ఇరవై ఒక్క రోజుల లాక్‌డౌన్‌ మన ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితి లేదు.

మన ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినేంది. ఎటువంటి ఇబ్బంది లేదని, అంత సులువ్ఞగా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం కూడా లేదు.

ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగుల జీతాలకు కోతలు విధించడం తగదని ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులు పేర్కొంటున్నారు.

వైద్య సిబ్బందికి ముందుగానే నాలుగు నెలల జీతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఒడిశా లో వైద్య సిబ్బందికి ముందస్తుగా నాలుగు నెలల జీతం ఇవ్వ డానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

కానీ తెలుగు రాష్ట్రాలలో ఉద్యోగుల జీతాలను సగానికి తగ్గించడం సరైంది కాదని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలని ప్రతి పక్షాలు, ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

కొన్ని రాష్ట్రాల్లో ఈ విధులు నిర్వహిస్తున్న వారికి ఒక నెల జీతాన్ని అదనంగా ఇస్తున్నారని నిపుణులు అంటున్నారు.

ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తే అదే బాటలో ప్రైవేటు సంస్థలు కూడా నడుస్తాయి. అందువల్ల సగటు ఉద్యోగి జీవితం అస్తవ్యస్తమవుతుంది.

ఇప్పటికే కొన్ని ప్రైవేట్‌ కంపెనీలు, విమానయాన సంస్థలు, టైర్ల కంపెనీలు ఉద్యోగుల జీతాల కోతలు విధిస్తున్నారు.

కరోనా వైరస్‌ కట్టడిలో రాత్రింబవళ్లు ప్రభుత్వ ఉద్యోగులైన అధికారులు, యంత్రాంగం, రెవెన్యూ అధికారులు, యంత్రాంగం, సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వంలోని ఉద్యోగులు కృషి చేస్తున్నారు.

ఈ తరుణంలో వారికి బాసటగా నిలవాల్సిన ప్రభుత్వం జీతాలలో కోతలు విధించి ఆర్థిక ఇబ్బందులకు గురి చేయటం తగదు.

ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్లకు నాలుగు నెలల జీతాన్ని అడ్వాన్స్‌గా ముందుగా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నది. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందించాల్సిన ప్రభుత్వాలు అందించక పోగా జీతాల్లో కోతలు విధించడం తగదు.

ఈ తరుణంలో వారికి బాసటగా నిలవాల్సిన ప్రభుత్వం జీతాలలో కోతలు విధించి ఆర్థిక ఇబ్బందులకు గురి చేయటం తగదు.

– వాసిలి సురేష్‌

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/