ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

People
voice of the people

గ్రామాల్లో నీటి ఎద్దడి:- ఎం.కనకదుర్గ, తెనాలి, గుంటూరుజిల్లా

రెండు తెలుగు రాష్ట్రాలలో 90శాతం గ్రామాలలో వేసవి ప్రారంభంలోనే తీవ్ర నీటి ఎద్దడి నెలకొని ఉంది. రిజర్వాయర్లు చెక్‌డామ్‌ చెరువులు ఎండిపోయాయి.

కేంద్ర భూగర్భజల వనరుల సంఘం నివేదిక ప్రకారం 85శాతం దిగుడుబావ్ఞలు, బోర్లు ఎండిపోయి తీవ్రకటకట ఎదుర్కొంటున్నారు.

తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకుప్రభుత్వం యుద్ధప్రాతిపదికపై చర్యలు చేపట్టాలి.

ప్రతిగ్రామానికి తాగునీరు అందించడంతో పాటు వేసవి తాపం నుండి సేద తీరడానికి చలివేంద్రాలను, విరామ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.

ఇందువలన వడదెబ్బ నుండిప్రజలకు కాస్తంతైనరక్షణ లభిస్తుంది.స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థల సహకారం, తోడ్పాటు తీసుకోవడం కూడా ఎంతో అవసరం.

పలు గ్రామాలలో పశుగ్రాసం కొరత తీర్చేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.

కేంద్రం వైఖరి అభినందనీయం: -డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

దేశంలో లాక్‌డౌన్‌ అమలుతో ఉపాధికోల్పోయిన పేదల్ని ఆదు కునే ఉద్దేశ్యంతో కేంద్రం ప్రకటించిన లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీ ఆపదలో ఊరట. ఎనభై శాతం మంది ప్రజలకు మేలు చేసే ప్రయత్నం. ఉన్నంతలో మంచి కార్యక్రమం.

ముఖ్యంగా 21 రోజుల దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇల్లుదాటలేని స్థితి. రోజువారీ సంపాదనతో బతుకులీడుస్తున్న కోట్లాది మంది పస్తులతో ఉండడం తప్ప వేరే మార్గం లేదు.

వారికి ఇప్పుడిస్తున్న రేషన్‌కి అదనంగా మనిషికి ఐదు కేజీల బియ్యం, కేజీ పప్పు ఇవ్వనున్నారు.

కొంత మేరకు ఆకలి తగ్గించే నిర్ణయం వల్ల కోట్లాది మందికి భరోసా కలుగుతుంది. అయితే ప్రజాపంపిణీ వ్యవస్థ సక్రమంగా నడవని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలి. అర్హులందరికీ కార్డుల ప్రమేయం లేకుండా సాయం అందాలి.

మతపరమైన సమావేశాలు వద్దు:-సి.హెచ్‌.ప్రతాప్‌, శ్రీకాకుళం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో మతపెద్దలతో చర్చించి మత పరమైన సమావేశాలు నిర్వహించకుండా చొరవ తీసుకోవా ల్సిన అవసరంఉంది.

నిజాముద్దీన్‌ మర్క్‌లో తబ్లీ గీ జమాత్‌, ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌తో వలస కార్మికులు గుమిగూడటం,చండీఘడ్‌లోగురుద్వారాలో అయిదు వంద ల మందితో లంగర్‌.

గుంటూరులో సామూహిక మత ప్రార్థనలు వంటి సంఘటనలు కరోనావ్యాప్తిపై తీవ్ర ప్రభా వం చూపించాయన్నది నిర్వివాదాంశం.

పెరుగుతున్న ఆకలి కేకలు:-ఎస్‌.క్రాంతికుమార్‌,తిరుమలగిరి, సూర్యాపేట

భారతదేశం వేగంగా అభివృద్ధిచెందుతోంది అని కేంద్రం గర్వం గా చెబుతోంది. సొంత దేశంలోని ఆకలికేకలు మాత్రం వినపడ నట్టే చూస్తుంది.

ఐదేళ్ల నుంచి ఊరిస్తూ అచ్చేదిన్‌ అంటూ వాటి ని కప్పెద్దామని ప్రయత్నిస్తుంది. ఎంత దాచినా వాస్తవం దాగ దుకదా అన్నట్టు,సర్వేలు మనంప్రపంచంలో ఆకలి సూచీపరం గా 117 దేశాలలో 102వస్థానంలో ఉన్నాం అని చెబుతున్నాయి.

ఇది ఏటాపెరుగుతూ వస్తోంది.ఎంతోమంది చనిపోతున్నా రు.ఆహారంలేక, సరైనభోజనం తీసుకోక పోషహకార లోపంతో ఐదేళ్లలోపు చిన్నారుల రోగాలబారినపడుతున్నారు.

ఇది ఇలాగే కొనసాగితే ఇంకా అట్టడుగు స్థాయికి పడిపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఏమాత్రం కృషి చేయకుండా కేంద్రం ఏదో పైపై నినాదాలు చేస్తూ కాలక్షేపం చేయకుండా ఈ సామాజిక సమస్యను అంతమొందించాలి.

వేతనాలలో కోత సరైందికాదు:-కామిడి సతీష్‌రెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలలో కోత విధిస్తూ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం సరైందికాదు.

ఈ మేరకు జి.వో నం.27ను విడుదల చేయడం ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్ష నర్లలో అసంతృప్తులు వ్యక్తం అవ్ఞతున్నాయి

. కరోనా వ్యాధిపై తెలంగాణ కంటే ఎక్కువగా పోరాడుతున్న కేరళ, మహారాష్ట్ర, లాంటి ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కోతపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.

కేరళ సర్కార్‌ కరోనా వైరస్‌ నిర్మూలన కోసం ఇరవై వేల కోట్ల రూపాయలు కేటా యించింది.

ప్రభుత్వం ఏకపక్షంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలు 50 శాతం కోత విధిస్తామని నిర్ణయం తీసుకోవడం సమంజసంకాదు.

ప్రతిపక్షం అవసరం: -డా.దన్నాన అప్పలనాయుడు, చీపురపల్లి

దేశంలో ప్రజల పక్షాన పోరాడటానికి బలీయమైన ప్రతి పక్షం అవసరం.కాని మనదేశంలోబ లమైనవో,బలం లేనివో మొత్తానికి ప్రతిపక్షాలున్నాయి.

అధికారపక్షం ప్రజావ్యతిరేక చర్యలు చేపడితే వెంటనే ఖండించి ప్రజలకు న్యాయం చేకూర్చేటట్లు ప్రయత్నించాలి.

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా కోరల్లో ఇరుక్కొని సతమతమవుతుంటే మనదేశంలో లౌక్‌డౌన్‌ను అందరూ హర్షించారు. కరోనా నివారణకు అవసరమైన అవగాహన అందరికీ ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/