పట్టుచీరెలు పదిలం..

ఇంటింటా మహిళలకు చిట్కాలు

Silk Sarees
Silk Sarees

ఖరీదైన పట్టు చీరను అల్మారాలో భద్ర పరిచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనసుకు నచ్చిన చీరను ఏళ్ల తరబడిపదిలంగా కాపాడు కోవచ్చు.

ఒకసారి వాడిన చీరను రెండు మూడు గంటలసేపు నీడలో గాలి తగిలేలా ఆరేయాలి. ఆ తరువాత పైటచెంగు లోపలివైపు వచ్చేలా మడతపెట్టాలి.

పైటంచు భాగం లోపలివైపు ఉంటే మంచిది. పొడిగా ఉండే తెల్లటి కాటన్‌ లేదా మస్లిన్‌ వస్త్రంలో చుట్టి బీరువాలో పెట్టాలి.

పట్టుచీరను మూడు నెలలకోసారి బయటకు తీసి కాసేపు నీడపట్టున ఆరేయాలి. ఆ తరువాత గతంలో వేసిన మడతను మార్చాలి. ఒకే మడతలో ఎక్కువ రోజులుంటే పోగులు తెగిపోవచ్చు.

వీటిని డ్రైక్లీనింగ్‌కు ఇవ్వాలి. చీర మీద కాపీ, టీ మరకలు పడితే అక్కడ రెండు చుక్కలు షాంపూ వేసి చన్నీటితో శుభ్రం చేయాలి. పట్టుచీరలను హ్యాంగర్‌లకూ తగిలించొచ్చు.

కానీ హ్మాంగర్‌కు ఒక్క చీరే ఉండాలి. వేరే హ్యాంగర్లకు మద్య దూరం ఉండేలా చూసుకోవాలి. స్టీలు/ఇనుప హ్యాంగర్ల వల్ల చీరలపై మెటల్‌ మరకలు పడే ప్రమాదముంది. కాబట్టి చెక్క హ్యాంగర్లనే వాడాలి.
నాఫ్తలిన్‌ ఉండలను వేసి మూటకట్టి చీరల మధ్య పెడితే పురుగుల బెడతద ఉండదు.

మంచి పరిమళమూ వస్తుంది. అలాగే ఎండు వేపాకులను మూటకట్టి చీరల అడుగున పెట్టాలి. దీని వల్ల చిన్న చిన్న పురుగులు దరిచేరకుండా పట్టు చీరలకు చిల్లులు పడకుండా ఉంటాయి.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/