హైదరాబాద్‌ ఈఎస్‌ఐలో మొబైల్ వైరాలజీ ల్యాబ్‌ ప్రారంభం

ఆన్‌లైన్‌లో ల్యాబ్‌ను ప్రారంభించిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

Union Ministers Launch India's First Mobile Virology Lab
Union Ministers Launch India’s First Mobile Virology Lab

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో దేశంలోనే తొలి మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌ ప్రారంభమైంది. దీన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి కెటిఆర్‌ కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, కిషన్ రెడ్డితో మాట్లాడారు. ఐ క్లీన్, ఐ సేఫ్ సంస్థల సహాయంతో డిఆర్ డిఒ ఈ ల్యాబ్ ను తయారు చేసింది. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం త్రిముఖ వ్యూహం అనుసరిస్తోందన్నారు. ప్రభుత్వం యుద్ధప్రతిపాదికన 1500 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఎనిమిది ఆస్పత్రులను కోవిద్19 ఆస్పత్రులుగా మార్చినామని, కేంద్రం మార్గదర్శకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామన్నారు. స్వీయనియంత్రణ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని కెటిఆర్ తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/