భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ వాక్సిన్‌ ‌ ట్రయల్స్‌ పున:ప్రారంభం

అనుమతించిన డీసీజీఐ

serum-institute-gets-nod-to-resume-oxford-covid-19-vaccine-trial-in-india

న్యూఢిల్లీ: భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు అనుమతి ఇచ్చింది. రెండు, మూడో దశలో క్లినికల్‌ ట్రయల్స్ నిలిపివేయాలని ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. స్క్రీనింగ్‌ సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటూ.. అదనపు సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలని సీరం ఇనిస్టిట్యూట్‌కు సూచించింది. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఎదురైతే వినియోగించాల్సిన వివరాలను తమకు సమర్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మనదేశంలో ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వాక్సిన్ ప్రయోగాలు తిరిగి మొదలు కానున్నాయి.

కాగా కొన్నిరోజుల క్రితం ఆ వ్యాక్సిన్‌ను తీసుకున్న ఓ వాలంటీర్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో బిట్రన్‌లో వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో ట్రయల్స్‌ను నిలిపివేశారు. బ్రిటన్ మెడిసిన్ హెల్త్ రెగ్యులేటరీ అధారిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో అస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌ను మళ్లీ ప్రారంభించారు. వ్యాక్సిన్‌తో ప్రమాదం లేదంటూ రెగ్యులేటరీ నుంచి క్లీన్ చిట్ రావడంతో ట్రయల్స్ పునఃప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ట్రయల్స్ నిర్వహించుకోవడానికి అనుమతి లభించిందని కంపెనీ తెలిపింది. ఈ క్రమంలో భారత్‌లోనూ రెండు, మూడో దశ ప్రయోగాలకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. డీసీజీఐ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో టీకా ప్రయోగాలు ముమ్మరంగా సాగనున్నాయి


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/