బిల్‌ గేట్స్‌ తండ్రి కన్నుమూత

తనపై ఆయన ప్రభావం ఎంతో ఉందన్న గేట్స్

బిల్‌ గేట్స్‌ తండ్రి కన్నుమూత
Bill Gates Sr, father of Microsoft co-founder, dies at 94

వాషింగ్టన్‌: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి విలియమ్ హెచ్ గేట్స్ (94) సోమవారం నాడు మృతి చెందారు. ఈ విషయాన్ని బిల్ గేట్స్ వెల్లడించారు. కుటుంబసభ్యుల మధ్యే ఆయన తుదిశ్వాస విడిచారని చెప్పారు. గత కొంత కాలంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని… ఈ నేపథ్యంలో జీవితంలో తప్పకుండా జరగాల్సిన రోజు కోసం తామంతా మానసికంగా సిద్దమయ్యామని తెలిపారు. తన తండ్రిని ఎంతగా మిస్ అవుతామో మాటల్లో చెప్పలేమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకున్న మేధస్సు, ఉదారత, గొప్ప భావాలతో తన తండ్రి ఎందరినో ప్రభావితం చేశారని బిల్ గేట్స్ చెప్పారు. తనపై కూడా ఆయన ప్రభావం ఎంతో ఉందని అన్నారు. అసలైన బిల్ గేట్స్ తన తండ్రేనని అన్నారు. మరోవైపు బిల్స్ గేట్స్ స్థాపించిన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ లో కూడా ఆయన తండ్రి పాత్ర ఎంతో ఉంది. విలియం గేట్స్ మృతి పట్ల పలువురు సంతాపాన్ని ప్రకటించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/