నవంబర్‌ 26 న ఆర్ఆర్ఆర్ నుండి మూడో సింగిల్

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటికే రెండు పాటలు వచ్చి దుమ్ములేపగా..ఇప్పుడు మూడో సాంగ్ రాబోతుంది. #RRRSoulAnthem పేరుతో మూడో సింగిల్ విడుదల చేయబోతుంది. జనని అంటూ సాగే ఈ థర్డ్‌ సింగిల్‌ ను నవంబర్‌ 26 వ తేదీన విడుదల చేయబోతుంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్‌ లో ఎన్టీఆర్‌, చరణ్‌, అలాగే… అజయ్ దేవ్‌ గన్‌ ఉన్నారు.

ఇక ఈ ముగ్గురిలో అజయ్‌ దేవ్‌ గన్‌ పవర్‌ ఫుల్‌ లుక్స్ లో కనిపిస్తుండగా.. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌… వీర తిలకం పెట్టుకుని… ఎదో సహాయం కోసం చూస్తున్నట్లు మనకు కనిపిస్తున్నాడు. ఇక జూనియర్‌ ఎన్‌టీఆర్‌ మాత్రం ముఖం నిండా గాయాలతో.. చాలా ఆవేశంతో కనిపించాడు. మొత్తం మీద ఈ పోస్టర్ అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్తుంది. మరి ఆ సాంగ్ ఎలా ఉండబోతుందో అని అంత ఆ సమయం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

#RRRSoulAnthem, #Janani / #Uyire will be out on November 26th. Gear up for an emotionally captivating experience. #RRRMovie @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @mmkeeravaani @DVVMovies @LahariMusic @TSeries pic.twitter.com/dNSzfp6p0d— RRR Movie (@RRRMovie) November 22, 2021