మరో 40 రైళ్లను ప్రకటించిన భారతీయ రైల్వే

కొత్త రైళ్లలో చాలా వరకు బీహార్ నుంచి రాకపోకలు సాగించేవే

indian-railways-announced-40-clone-special-trains

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే కొత్తగా మరో 40 రైళ్లను ప్రకటించింది. ఈ నెల 21 నుంచి ఇవి పట్టాలెక్కనున్నాయి. వీటిలో చాలా వరకు రైళ్లు బీహార్ నుంచి రాకపోకలు సాగించనుండగా, రెండు రైళ్లు మాత్రం సికింద్రాబాద్-ధన్‌పూర్ మధ్య తిరగనున్నాయి. ఈ నెల 19 నుంచి వీటికి రిజర్వేషన్ ప్రారంభం కానున్నట్టు అధికారులు తెలిపారు. 38 రైళ్లకు హమ్‌సఫర్ చార్జీలను నిర్ణయించగా, లక్నోఢిల్లీ రైలుకు మాత్రం జనశతాబ్ది చార్జీలను నిర్ణయించారు. తాజాగా ప్రకటించిన 40 స్పెషల్ ట్రైన్స్ 2020 సెప్టెంబర్ 21 నుంచి అందుబాటులోకి రానున్నాయి. వీటిని క్లోన్ స్పెషల్ ట్రైన్స్ అని తెలిపింది రైల్వే. అంటే ఇప్పటికే ప్రత్యేక రైళ్లు నడుస్తున్న రూట్లలో కొన్ని రైళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లలో మాత్రమే కొత్తగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది రైల్వే.

రైలు నెంబర్ 02787 సికింద్రాబాద్ నుంచి దానాపూర్ ప్రతీ రోజూ ఉదయం 7.30 గంటలకు బయల్దేరుతుంది. ఇక రైలు నెంబర్ 02788 దానాపూర్ నుంచి సికింద్రాబాద్‌కు ప్రతీ రోజు ఉదయం 9 గంటలకు బయల్దేరుతుంది.

రైలు నెంబర్ 06509 బెంగళూరు నుంచి దానాపూర్ ఉదయం 8 గంటలకు బయల్దేరుతుంది. రైలు నెంబర్ 06510 దానాపూర్ నుంచి సాయంత్రం 6.10 గంటలకు బెంగళూరు బయల్దేరుతుంది. ఈ రెండు రైళ్లు విజయవాడ, వరంగల్ విజయవాడ, వరంగల్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/