పెద్ద ఎత్తున వృద్ధుల, వికలాంగుల పెన్షన్లు తొలగించారు

గ్రామ వాలంటీర్లు ఇష్ట వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు

devineni uma
devineni uma

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం పెద్ద ఎత్తున వృద్ధులు, వికలాంగుల పెన్షన్లను తొలగించారని టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. గ్రామ వాలంటీర్లు బాధ్యతతో వ్యవహరించకుండా..ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటున్నారని అన్నారు. మంత్రులంతా డమ్మీలు అయ్యారని ఎద్దేవా చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై బురద చల్లడమే పనిగా మంత్రులు పెట్టుకున్నారని విమర్శించారు. ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని దుయబట్టారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం టిడిపిపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/