ఖుషి సెన్సార్ పూర్తి

విజయ్ దేవరకొండ – సమంత జంటగా మజిలీ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ఖుషి. గతేడాది లైగర్‌ మూవీతో భారీ ప్లాప్ అందుకున్న విజయ్. సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం ఈ ఏడాది నిరాశపరిచింది. ఇప్పుడు వీరిద్దరు కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా తాలూకా సాంగ్స్ , ట్రైలర్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై ఆసక్తి నింపాయి. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడం తో మేకర్స్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసారు.

సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు. ఈ సినిమా రొటీన్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని , ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ చిత్రమని అంటున్నారు. ఈ సినిమా పూర్తి నిడివి రెండు గంటల 45 నిమిషాలు. అంటే సరైన లెంగ్త్‌నే శివ నిర్వాణ ఫిక్స్ చేశాడు. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. పాన్ ఇండియన్ రేంజ్‌లో ఈ సినిమాను ప్లాన్ చేశారు.