కూలి భవనం..11 మంది దుర్మరణం

ముంబయి లో కూలిన 4 అంతస్తుల భవనం..గత రాత్రి 11.30 గంటల సమయంలో ఘటన

ముంబయి: ముంబయి లో ఘోర ప్రమాదం జరిగింది. మల్వాని ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గత రాత్రి 11.10 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో చిన్నారులు సహా పలువురు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు స్థానికులతో కలిసి సహాయక కార్యక్రమాలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న 15 మందిని రక్షించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.

సహాయక కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. కూలిన భవనం సమీపంలోని ఇతర బిల్డింగులు కూడా ప్రమాదంలో ఉండడంతో అందులోని వారిని ఖాళీ చేయించినట్టు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల వల్లే భవనం కూలినట్టు మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్ తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/