చిరంజీవి ఫై ప్రశంసలు కురిపించిన కుష్భు..

సీనియర్ నటి కుష్భు..మెగాస్టార్ చిరంజీవి ఫై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈమె రామబాణం మూవీ లో కీలక పాత్ర పోషించింది. గోపీచంద్ హీరోగా నటించగా శ్రీవాస్ డైరెక్ట్ చేసారు. రేపు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో సినిమా ప్రమోషన్లో పాల్గొన్న కుష్భు..ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ లో సినిమా విశేషాల గురించి మాట్లాడుతూ..చిరంజీవి ఫై ప్రశంసలు కురిపించింది.

“చిరు నుంచి నేర్చుకోవల్సింది చాలా ఉంది.. ఆయన ఓ లెజెండ్‌. మానవత్వం కలిగిన వ్యాక్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం చిరంజీవిది అన్నారు. అంతే కాదు చేసే పని మీద ప్యాషన్‌ కూడా ఆయనకు ఎక్కువగా ఉంటుంది.. అంతే కాదు ఆయన ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. కొత్తది చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు.. అంతే కాదు నేను మెగాస్టార్ ను కదా.. ఏం చేసినా.. జనాలు చూస్తారు లే అని ఆయన అనుకోరు.. కొత్తగా చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు.. ఇప్పటివరకు పూర్తి కాని, నా కల ఏదైనా ఉంది అంటే అది చిరంజీవి గారితో రొమాన్స్‌ చేయలేకపోవటమే. స్టాలిన్‌లో ఆయనతో కలిసి నటించాను. కాని ఆ సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి రీసెంట్ గా ఓ కమర్షియల్‌ యాడ్‌ చేశాము. దానికి మంచి స్పందన వచ్చింది. ఆయనతో కలిసి పని చేయటానికి ఓ మంచి స్క్రిప్టు కోసం చూస్తున్నా.. మెచ్యూర్‌ లవ్‌స్టోరీ, ఫ్యామిలీ డ్రామాలాంటివి చిరంజీవి గారితో చేయాలని ఉంది. అదే నా కల..” అంటూ చెప్పుకొచ్చింది.