బన్నీ కి జోడిగా సంయుక్త..?

ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు సంయుక్త మీనన్. భీమ్లా నాయక్ మూవీ తో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ..వరుస సక్సెస్ లతో గోల్డెన్ బ్యూటీ గా మారింది. రీసెంట్ గా సార్, విరూపాక్ష మూవీస్ తో హిట్స్ అందుకుంది. దీంతో అమ్మడి కోసం నిర్మాతలు , దర్శకులు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో సంయుక్తకు మరో భారీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.

ప్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చిందని టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘పుష్ప 2’ తో బిజీ గా ఉన్న బన్నీ .. నెక్స్ట్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ హీరోయిన్లలో ఒకరిగా సంయుక్తకు త్రివిక్రమ్ నుంచి పిలుపు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే సంయుక్తకు టాలీవుడ్ లో ఇక తిరుగుండదని అంటున్నారు.