తమ్ముడి బుగ్గ మీద దిష్టి చుక్క పెడుతున్న మంచు లక్ష్మి

మంచు మనోజ్ వివాహ వేడుక తన అక్క మంచు లక్ష్మి ఇంట అట్టహాసంగా జరుగుతుంది. భూమా మౌనిక రెడ్డి ని ఆయన రెండో వివాహం చేసుకోబోతున్నాడు. గత కొద్దీ రోజులుగా భూమా మౌనిక రెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు..మార్చి 03 న వీరి వివాహం జరగబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ మంచు ఫ్యామిలీ మాత్రం ఈ పెళ్లి ఫై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఈరోజు ఉదయం మనోజ్ ట్విట్టర్ వేడుకగా పెళ్లి కూతుర్ని పరిచయం చేసాడు. ‘మనోజ్ వెడ్స్ మౌనిక’ అంటూ హార్ట్ సింబల్ ను పోస్ట్ చేశారు.

ఇక సాయంత్రం నుండి మనోజ్ వివాహ వేడుకకు దగ్గరి వారు స్నేహితులు హాజరవుతూ వస్తున్నారు. కొద్దీ సేపటి క్రితం మంచు లక్ష్మి తన సోషల్ మీడియా వేదికగా మనోజ్ బుగ్గ మీద దిష్టి చుక్క పెడుతూ ఉన్న ఒక ఫోటో మీడియాలో షేర్ చేసింది. దానికి పెళ్లి కొడుకు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. భూమా మౌనిక వెడ్స్ మంచు మనోజ్ అంటూ ఆమె సోషల్ మీడియాలో ఈ ఫోటోని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది. కుటుంబం భూమా నాగిరెడ్డి కుమార్తె అయిన మౌనిక రెడ్డికి గతంలో పెళ్లి జరిగి విఫలమైంది. మనోజ్ కు కూడా పెళ్లి జరిగి విడాకులకు దారి తీసింది. ఇక ఇప్పుడు వీరిద్దరూ కూడా రెండో వివాహ బంధం తో ఒకటి కాబోతున్నారు.

ఇక మనోజ్ సినిమాల విషయానికి వస్తే..కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడి గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన మంచు మనోజ్..తనదైన యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ వచ్చాడు. 2004లో దొంగ దొంగది సినిమాతో హీరోగా పరిచయమైన మనోజ్.. ఆ తర్వాత బిందాస్ చిత్రంతో నంది అవార్డ్ అందుకున్నారు. తర్వాత వేదం, ఝుమ్మంది నాదం, కరెంట్ తీగ, రాజు భాయ్ వంటి చిత్రాలతో మెప్పించారు. ఆ తర్వాత పలు ప్లాప్స్ పడేసరికి సినిమాలకు దూరమయ్యాడు.

ఆరేళ్ల బ్రేక్ తర్వాత మనోజ్ తన కొత్త సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు ‘వాట్ ది ఫిష్’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి వరుణ్ కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్.. సినిమా గురించిన కీలక అంశాలను వెల్లడించారు మనోజ్. మరి ఈ సినిమాను ఎప్పుడు మొదలుపెడతారో..ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో చూడాలి.