ధర్మరాజు అశ్వమేధయాగం

vaartha devotional stories
om

కురుక్షేత్ర మహా సంగ్రామంలో విజయం సాధించిన తర్వాత పట్టాభిషిక్తుడైన ధర్మారాజు అశ్వమేధయాగం మమౄవైభోపేతంగా చేసి అనేమైన లెక్కలేనంత మంది బ్రాహ్మణులకు అన్నదానాలు చేసారు.ధర్మరాజును అందరూ పొగుడుతుంటే లోలోపల పొంగిపోతున్నాడు. ఆ సమయంలో అక్కడికి ఒక ముంగిస ప్రవేశించింది. విప్రులు భోజనానంతరం హస్త ప్రక్షాళనం చేసుకునే ప్రదేశంలో పొర్లాడి తన శరీరం బంగారు మయం కాకుండా బురదమయం అయినందుకు అక్కడి వారిని ఉద్దేశించి ఈ విధంగా చెప్పింది. ‘ఉంఛవృత్తిలో జీవించే విప్రుడైన సక్తు ప్రస్తుడు పాడిపంటలు నశించి కరువు కాటకాలు ఏర్పడన తమ ఊరిలో ఆ గ్రామ ప్రాంతంపు పొలాలలో మిగిపడి ఉన్న గడ్డి ధాన్యపు గింజలను ఏరుకునితెచ్చి పిడి చేయించి నలుగురు కుటుంబసభ్యులు ఆ పేలపిండిని సరిసమానంగా పంచుకుని ఆహారంగా తీసుకుంటుండగా అక్కడికి ఆకలితో ఉన్న ఓ వృద్ధ బ్రాహ్మణుడు వస్తాడు. ఆకలి తీర్చమని కోరగా సక్తుప్రస్థుని కుటుంబం ఆ ఆహారాన్ని అతని సమర్పిస్తారు. సంతుష్టుడైన ఆ వృద్ధుడు ధర్మదేవతగా సాక్షాత్కరించి సక్తుప్రస్థుని ధర్మనిరతిని మెచ్చి వారికి బ్రహ్మలోక ప్రాప్తిని కలిగిస్తాడు. అప్పుడు ఆ గృహస్తులు త్యాగదానం చేసిన చోట నేలపై పడి ఉన్న పేలపిండి నలకను వాసన చూడగానే ముంగిస తలంతా బంగారుమయమైపోయింది.
ఆ పేలపిండి పడి ఉన్న చోటంతా పొర్లాడితే ముంగిస దేహంలో అర్ధభాగం బంగారంతో మెరిసిపోయింది. దాంతో మిగిలిన ఆ సగభాగం స్వర్ణమయంగా చేసుకుని ప్రయత్నం చేస్తున్నాను. అప్పటి నుంచి మరో మహాత్ముడి కోసం ఎదురు చూస్తున్నాను. ఈ ధర్మరాజు అశ్వమేధయాగ వైభోగం చూద్దామని ఇక్కడికి వచ్చాను. కాని ఇపుడీ స్థలంలో నేను ఎంత పొర్లినా బురదనే. నా ఒంటిని స్వర్ణం చేసే శక్తి ఈ దానభూమికి లేదని విచారంగా చెప్పింది.
ఇలా ఎందుకు జరిగిందని ధర్మరాజు చింతించగా, నానాదేశపు రాజులను యుద్ధంలో ఓడించి తెచ్చిన ధనరాసులతో ధర్మరాజు చేసే యజ్ఞయాగాదులు, దానధర్మాలు సక్తుప్రస్తుని దానగుణంతో పోల్చదగినది కాదని సక్తుప్రస్థుని తపోయజ్ఞము చాలా గొప్పదని తేల్చి చెప్పిన ముంగిస ధర్మరాజుకు జ్ఞానోదయాన్ని కలిగించింది. అతిధి క్షుద్భాతను తీర్చడానికి తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన కురుక్షేత్ర నివాసి, సక్తుప్రస్థుని వృత్తాంతం ద్వారా అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పదని ముంగిస చెప్పిన ఈ దృష్టాంతం ప్రకారం నిస్వార్ధ పరాయణుడైన సక్తుప్రస్థుని అన్నదానం, బ్రహ్మశ్రేష్టమైన అన్నదానంగా వన్నెకెక్కింది. అతిధి అన్నార్తికి చిన్ని కడుపు నిండినంతట తన ప్రాణాలను నిలుపుకొని ఇక చాలు అన్న ఆత్మసంతృప్తితో అనగలిగే అతిధి దేవుడికి, అన్నదాత సుఖీభవ అని అన్నదాతను హృదయ పూర్వకంగా ఆశీర్వదించగలిగే మహమోపేతమైన దివ్యదైవిక శక్తి తనలోన ఉద్భవిస్తుంటే అది ఒక్క అన్నదాన మహిమే కదా!
– ఉలాపుబాలకేశవులు

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/