బండి సంజయ్ కామెంట్స్ ఫై కేటీఆర్ సెటైరికల్ ట్వీట్

మంత్రి కేటీఆర్..నిన్న బండి సంజయ్ చేసిన కామెంట్స్ కు సెటైరికల్ ట్వీట్ చేసారు.సీఎం కేసీఆర్‌కు కూడా ఈడీ విచారణ తప్పదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేసారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ (పీఎంవో)ని అడ్రస్ చేస్తూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ని ఈడీ చీఫ్‌గా కూడా నియమించినందుకు ధన్యవాదాలు అంటూ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. దేశాన్ని నడుపుతున్న డబుల్‌ ఇంజిన్‌ మోదీ, ఈడీ అని దీంతో అర్థమవుతున్నదని ట్వీట్‌ చేశారు.

అంతకుముందు.. గురువారం సిద్దిపేట జిల్లా నాంచరపల్లిలో నిర్వహించిన జనం గోస- బీజేపీ భరోసా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా త్వరలో ఈడీ విచారణ ఎదుర్కొంటారని వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ మీద జరుగుతున్న ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న నిరసనలకు కేసీఆర్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా విచారణలకు హాజరయ్యారని కానీ ఏ రోజు కూడా ఇలా చేయలేదంటూ సోనియా గాంధీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

Dear @PMOIndia

Thanks for appointing your BJP state president Sri BS Kumar as the Chief of ED also 👏👏

Now we realise double engine that runs this country is actually “Modi & ED” #ModiGovt pic.twitter.com/IlyOcbh9ty— KTR (@KTRTRS) July 22, 2022