ఎన్టీఆర్ హిస్ట‌రీ క్రియేట్ చేస్తే.. కేసీఆర్ హిస్ట‌రీతో పాటు జాగ్ర‌ఫీని కూడా క్రియేట్ చేసారంటూ కేటీఆర్ ప్రశంసలు

హైదరాబాద్ లోని HICC లో టీఆర్ఎస్ ప్లీనరీ సభ కన్నులపండుగగా జరుగుతుంది. ఈ సభలో కేటీఆర్ మాట్లాడుతూ..ఎన్టీఆర్ హిస్ట‌రీ క్రియేట్ చేస్తే.. కేసీఆర్ హిస్ట‌రీతో పాటు జాగ్ర‌ఫీని కూడా క్రియేట్ చేసారంటూ కేసీఆర్ ఫై ప్రశంసలు కురిపించారు. అన్ని రాష్ట్రాల‌కు సీఎంలు ఉంటారు. కానీ మ‌న తెలంగాణ‌కు రాష్ట్రాన్ని సాధించిన వ్య‌క్తి ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. ఇది గొప్ప విష‌య‌మ‌న్నారు. ద‌శాబ్దాల చ‌రిత్ర‌లో ఎంతో మంది రాజ‌కీయ పార్టీలు పెట్టినా, ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసినా.. ఇద్ద‌రే మ‌హానుభావులు చ‌రిత్ర‌లో నిల‌బ‌డిపోయారు. మొద‌టి వ్య‌క్తి ఎన్టీఆర్, రెండో వ్య‌క్తి కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు. ఎన్టీఆర్ హిస్ట‌రీ క్రియేట్ చేశారు.. కేసీఆర్ హిస్ట‌రీతో పాటు జాగ్ర‌ఫీని కూడా క్రియేట్ చేశార‌ని కేటీఆర్ ప్ర‌శంసించారు. అన్ని రాష్ట్రాల‌కు సీఎంలు ఉంటారు. కానీ మ‌న తెలంగాణ‌కు రాష్ట్రాన్ని సాధించిన వ్య‌క్తి ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. ఇది గొప్ప విష‌య‌మ‌న్నారు.

ఆనాటి రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీని క‌లిసిన‌ప్పుడు కేసీఆర్‌ను ఉద్దేశించి ఒక మాట అన్నారు. జీవితంలో చాలా మంది చాలా ప్ర‌య‌త్నాలు చేస్తారు. ల‌క్ష్యాలు నిర్ణ‌యించుకుంటారు. కానీ ల‌క్ష్యాల‌ను చేరుకోలేక‌పోతారు. కానీ మీరు ఆ లక్ష్యాన్ని జీవిత‌కాంలోనే చేరుకున్నారు. మీరు ముఖ్య‌మంత్రి కూడా అయ్యారు.. మీ జీవితం ధ‌న్య‌మైపోయింద‌ని ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ చేసిన వ్యాఖ్య‌ల‌ను కేటీఆర్ గుర్తు చేశారు. 75 ఏండ్ల స్వాతంత్ర్యంలో ఎంతో మంది ప్ర‌ధానులు, ముఖ్య‌మంత్రులు ఆకుప‌చ్చ రుమాలు మెడ‌లో వేసుకున్న‌వారే. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక రైతుబంధు అనే గొప్ప ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టారు. మ‌న రైతుబంధు కేంద్రానికి ప్రేర‌ణ అయింది. మిష‌న్ భ‌గీర‌థ‌ను కేంద్రం కాపీ కొట్టి మంచినీళ్లు ఇచ్చే కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. టీఎస్ ఐపాస్ అనే ప‌థ‌కాన్ని కాపీ కొట్టి సింగిల్ విండో విధానాన్ని అమ‌లు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.