కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు : ప్రశాంత్ కిశోర్

వ్యూహకర్తగా మాత్రమే ఉండాలన్న పార్టీ అధిష్ఠానం


న్యూఢిల్లీ: గత రెండు వారాలుగా కాంగ్రెస్ అధిష్ఠానంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగింది. అయితే, అన్ని ఊహాగానాలకు తెరదింపుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ కు వ్యూహకర్తగా మాత్రమే పని చేస్తానని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ పగ్గాలను ప్రియాంక గాంధీకి ఇవ్వాలని ఆ పార్టీ అధిష్ఠానానికి ప్రశాంత్ కిశోర్ సూచించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి పార్టీలో ఒక కీలకమైన హోదాను పీకే ఆశించారు. అయితే, పార్టీ వ్యూహాలను రూపొందించే సాధికారిక బృందంలో సభ్యుడిగా మాత్రమే ఉండాలని అధిష్ఠానం ప్రతిపాదించడంతో… ఆయన పార్టీలో చేరే ఆలోచనను విరమించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ కు తన కంటే ఎక్కువగా… సంస్థాగత సమస్యలను గుర్తించే నాయకత్వం అవసరమని ఆయన అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/