‘రేటెంత రెడ్డి’ అంటూ కేటీఆర్ సెటైర్ ..

మరోసారి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..మంత్రి కేటీఆర్ తనదైన స్టయిల్ లో విమర్శలు చేశారు. తెలంగాణ లో ఎన్నికలు సమీపిస్తుండడం తో అధికార పార్టీ ..ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా బిఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య మాటల వార్ రోజు రోజుకు పెరిగిపోతుంది.

తాజాగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ లో టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయని..డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వారికే టిక్కెట్లు ఇస్తున్నారని..ఈ విషయాన్నీ ఆ పార్టీ నేతలే అంటున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అందుకే మొన్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, నిన్న మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి రాజీనామా చేసి నా సమక్షంలోనే బీఆర్ఎస్ లో చేరారు అని కేటీఆర్ వెల్లడించారు.

ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి ని ..రేవంత్ రెడ్డి అనడం కంటే రేటెంత రెడ్డి అని అంటున్నారు. పాపం కాంగ్రెస్ పార్టీకి అలాంటి పరిస్థితి వచ్చింది అంటూ కేటీఆర్ వ్యంగ్యం ప్రదర్శించారు. మరో విషయం కూడా రాసిపెట్టుకోండి… ఎన్నికలైన మరునాడే గెలిచిన పదో పన్నెండు మందో ఎమ్మెల్యేలతో కలిసి ఇదే రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ చేయకపోతే నన్ను నిలదీయండి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.