దసరా సెలవుల్లో మార్పు చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవుల్లో మార్పు చేసింది. ముందుగా అక్టోబర్ 24, 25 తేదీల్లో సెలవులు ఉంటాయని ప్రకటించింది. కానీ ఇప్పుడు అక్టోబర్ 23, 24 తేదీల్లో సెలవులు ఉంటాయని ప్రకటించింది. వాస్తవానికి దసరా పండుగ విషయంలో కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో తెలంగాణ విద్వత్‌ సభ ఈ నెల 23న దసరా పండుగను నిర్వహించుకోవాలని సూచించింది. ఈ క్రమంలో ప్రభుత్వం విజయ దశమి సెలవును మార్చింది. ఇంతకు ముందు ప్రకటించిన సెలవును సైతం కొనసాగింది.

స్కూల్‌ విద్యార్థులకు సెలవులతో పాటు, మిగతా వారికి అక్టోబర్ 23, 24 తేదీల్లో దసరా సెలవులు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. బతుకమ్మ పండుగ ప్రారంభం రోజును అక్టోబర్ 14న సాధారణ సెలవు ఇవ్వగా.. దుర్గాష్టమి అక్టోబర్ 22న ఆప్షనల్‌ హాలిడేగా ఇచ్చింది. ఇక.. దసరా పండుగ నేపథ్యంలో పాఠశాలలకు దాదాపు 13 రోజులు పాటు సెలవులు ఇవ్వగా.. జూనియర్‌ కాలేజీలకు ఏడు రోజులు సెలవులు ఉండనున్నాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు సెలవులు కొనసాగనుండగా.. 26న కాలేజీలు పునఃప్రారంభంకానున్నాయి.