ఇసుకలారీలు స్టాక్ పాయింట్ కి చేరట్లేదు

నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను ధిక్కరిస్తున్నారు

devineni uma maheswara rao
devineni uma maheswara rao

అమరావతి: టిడిపి నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఏపి ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. అమరావతి నుండి బయలుదేరిన ఇసుకలారీలు స్టాక్ పాయింట్ కి చేరకుండా మధ్యలో తినేస్తున్నారని, దోసెడు ఇసుక కూడా దొరకడం లేదని మీ ఎమ్మెల్యేలు, ఎంపీ చెప్పారు. బల్క్ బుకింగ్ లో దోచేస్తున్నారు.. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను ధిక్కరించి దోచేస్తున్న లక్షలాది టన్నుల ఇసుకదోపిడీపై సమాధానం చెప్పండి వైఎస్ జగన్‌ గారూ’ అని దేవినేని ఉమ నిలదీశారు. కాగా ఇటీవల గుంటూరు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఇసుకపై జరిగిన సమీక్షలో వైఎస్‌ఆర్‌సిపి మ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో ఎవరికైనా అవసరమైతే దోసెడు ఇసుక కూడా దొరకడం లేదని అన్నట్టు పేర్కొన్నారు. ఈ విషయంపై కలెక్టర్‌కు చెప్పినా ఉపయోగం లేదని చెప్పినట్లు పేర్కొన్నారు. అమరావతిలో ఇసుకతో బయల్దేరిన లారీ వినుకొండ రాకుండానే మాయమవుతోందని ఆయన చెప్పినట్లు పేర్కొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/