మహారాష్ట్ర ఎంపీ నవనీత్‌ కౌర్‌ రానా దంపతులకు బెయిల్ మంజూరు

హనుమాన్ చాలీసా వివాదం లో అరెస్ట్ అయినా మహారాష్ట్ర ఎంపీ నవనీత్‌ కౌర్‌ రానా, ఆమె భర్త రవి రానాలకు కోర్ట్ బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతులు విధించింది. మీడియాతో మాట్లాడవద్దని నవనీత్ కౌర్ దంపతులకు ఆదేశించింది న్యాయస్థానం. అలాగే నవనీత్ కౌర్ దంపతులకు 50 వేల పూచీకత్తు పై జస్టిస్ ఆర్ఎన్ రోకడే ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.

సీఎం ఉద్దవ్‌ థాక్రే ఇంటి ముందు హనుమాన్‌ చాలీసా పఠిస్తామంటూ ముంబైలో ఉద్రిక్తతలకు కారణం అయ్యారు. ఈ తరుణంలో ఏప్రిల్‌ 23వ తేదీన ఖర్‌ స్టేషన్‌ పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బైకులా జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఈ జంట బెయిల్‌ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నప్పటికీ..కోర్ట్ బెయిల్ ఇవ్వలేదు. ఈ క్రమంలో మరోసారి వాదనలు విన్న కోర్ట్ ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది.