నేడు కెటిఆర్ రోడ్ షోల వివరాలు

నేటితో ముగియనున్న ప్రచార పర్వం

KTR road shows today
TS Minister KTR

Hyderabad: గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం చివరిదశకు చేరుకున్నది. నేటితో ప్రచార పర్వం ముగియనుంది.

ఇప్పటికే నగరంలోని అన్ని డివిజన్లలో ప్రచారం నిర్వహించిన మంత్రి కెటిఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో చివ‌రి రోజైన నేడు ఇవాళ గోషామహల్‌, సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల్లో రోడ్‌ షోలలో పాల్గొననున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు గోషామహల్‌లోని జుమారత్‌బజార్‌, 3 గంటలకు సనత్‌నగర్‌ పాటిగడ్డ చౌరస్తా రోడ్‌షోల్లో ప్రసంగించనున్నారు.

సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్‌లోని శాంతినగర్‌ కాలనీ చౌరస్తాలో ఆయా అభ్యర్థులతో కలిసి మంత్రి కేటీఆర్‌ రోడ్‌షోల్లో ప్రసంగించనున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/