‘మా’ లో నరేష్ చేసిన మోసాలు బయటపెట్టిన జీవిత రాజశేఖర్

‘మా’ ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో ప్యానల్ సభ్యుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ , నరేష్ లు ఇరువురు ఒకరిపై ఒకరు సంచలన విమర్శలు చేసుకోగా..ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యురాలు జీవిత రాజశేఖర్..’మా’ లో నరేష్ చేసిన మోసాలు బయటపెట్టింది.

మా డైరీ లాంచ్ నుంచి నటుడు నరేష్ తో విభేదాలు వచ్చాయని జీవిత రాజశేఖర్ చెప్పుకొచ్చింది. నరేష్ అస్సలు ఈసీ మీటింగ్ పెట్టడు.. ‘మా’లో ఏ పని ఆగినా, నరేష్ వల్లే జరిగింది. ఒక లేడీని టార్గెట్ చెయ్యటం సిగ్గుగా లేదా..? అని జీవిత ప్రశ్నించింది. మా అంటేనే అసహ్యం వచ్చేలా, నరేష్ ప్రవహిస్తున్నారు. నరేష్ నారధుడిలా మారారు..’ అని నరేష్ ను లక్ష్యంగా జీవిత విరుకుపడింది. జనరల్ బాడీ మీటింగ్ పెడితే తనను దింపే స్తారని నరేష్ అపోహ పడ్డారని చురకలంటించారు. బేదాభిప్రాయాలు ఉన్నప్పుడు డైరీ లాంచ్ గ్రాండ్ గా చేయొద్దని కోరినా నరేష్ వినలేదని తెలిపారు.