కరోనావైరస్‌…మరింత అప్రమత్తమైన భారత్‌

జపాన్, దక్షిణ కొరియా పౌరులకు భారత్ వీసాల జారీ నిలిపివేత

india-stops-issuing-visas
india-stops-issuing-visas

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌(కొవిడ్‌-19) చైనాతో పాటు వివిధ దేశాలకు విస్తరించింది.తాజాగా నిన్న పాకిస్థాన్ లో కూడా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా దక్షిణకొరియా, ఇరాన్, ఇటలీ దేశాలను కూడా కరోనా వణికిస్తోంది. ఈ నేపథ్యంలో, భారత్ మరింత అప్రమత్తమైంది. దక్షిణకొరియా, జపాన్ దేశాల్లో కరోనా వైరస్ మృత్యు ఘంటికలు మోగిస్తున్న క్రమంలో ఆ దేశాల పౌరులకు వీసాల జారీని ఆపేసింది. ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ మాట్లాడుతూ, ఆ దేశాల నుంచి భారత్ కు వచ్చే పౌరులకు తాత్కాలికంగా వీసాల జారీని నిలిపివేస్తున్నామని ప్రకటించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/