అమిత్ షా రోడ్ షో
సాయంత్రం ముఖ్యనేతలతో ఎన్నికలపై సమీక్ష

Hyderabad: బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఆదివారం జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్నారు..
అక్కడి నుంచి ఆయన నేరుగా 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 11:15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 11:45కు వారాసిగూడ చౌరస్తా చేరుకుంటారు.
ఒంటి గంట వరకు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని వారాసిగూడ చౌరస్తా నుంచి సీతాఫల్మండిలోని హనుమాన్ టెంపుల్వరకు నిర్వహించే రోడ్డు షోలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 1:30 గంటలకు నాంపల్లిలోని రాష్ట్రపార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. భోజన విరామం అనంతరం సాయంత్రం 4 గంటల వరకు పార్టీ ముఖ్యనేతలతో ఎన్నికలపై సమీక్ష నిర్వహిస్తారు.
అనంతరం, తిరిగి ఢిల్లీ వెళతారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/