రేవంత్‌రెడ్డిపై 8 ఫిర్యాదులు చేసాం..ఈసీ పట్టించుకోలే – కేటీఆర్

ప్రజాస్వామ్యంలో స్వతంత్ర సంస్థగా ఉన్న ఎన్నికల సంఘం అన్ని పార్టీలను ఒకే తీరుగా చూడాలని, అలాకాకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని, సీఎం రేవంత్ ఫై 08 పిర్యాదులు చేసాం అయినానప్పటికీ పట్టించుకోలే..కానీ మా అధినేత ప్రశ్నింస్తే ఆయన ఫై 48 గంటల పాటు నిషేధం విధించారు ఇదెక్కడి న్యాయం అన్నారు కేటీఆర్.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి సికింద్రాబాద్‌ బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి తీగుల్ల పద్మారావుగౌడ్‌కు మద్దతుగా సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌, నాంపల్లి నియోజకవర్గాల్లో కేటీఆర్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…బిఆర్ఎస్ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించడంలేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో స్వతంత్ర సంస్థగా ఉన్న ఎన్నికల సంఘం అన్ని పార్టీలను ఒకే తీరుగా చూడాలని, అలాకాకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేసారు. స్వేచ్ఛగా, ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరగాలంటే ఎన్నికల సంఘం వ్యవహరించాల్సి తీరు ఇది కాదని చెప్పుకొచ్చారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు 28 ఫిర్యాదులను చేసింది. అయినా కూడా ఒక్కదానిపై సరైన విధంగా సరైన సమయంలో స్పందించడంలేదని ..సీఎం , పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై 8 ఫిర్యాదులు , ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీపై పిర్యాదు చేసినప్పటికీ వారిపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని వాపోయారు.