రాత్రి పూట మహిళ ప్రయాణికురాలు పడుతున్న ఇబ్బందికి స్పందించిన మంత్రి కేటీఆర్

ktr

రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్..సోషల్ మీడియా లో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. ఎవరు ఏ ఆపదలో ఉన్న, ఏ కష్టమొచ్చినా అది రాత్రయినా , పగలైనా సరే వెంటనే వారిని ఆదుకోవడం లో కేటీఆర్ ముందుంటారు. ఇప్పటికే ఎంతోమందికి సాయం చేసిన కేటీఆర్..తాజాగా రాత్రి పూట మహిళ ప్రయాణికురాలు పడుతున్న ఇబ్బందికి వెంటనే స్పందించి మరోసారి వార్తల్లో నిలిచారు.

సికింద్రబాద్ రైల్వే స్టేషన్ బయట రాత్రి 10 తర్వాత మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని.. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు మహిళలకు సురక్షితమైన రవాణా సౌకర్యం అందించాలని హర్షిత అనే మహిళ కేటీఆర్ కి ట్విట్ చేసింది. ఈమె ట్విట్ కి మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లు, బ‌స్టాండ్ల‌లో ట్రాకింగ్ వ్యవస్థను తీసుకు వచ్చి మహిళలకు సురక్షితమైన రవాణా ఏర్పాటు చేయాలని డీజీపీకి సూచించారు. అలాగే మహిళలు పడుతున్న ఇబ్బందుల గురించి తెలిజేస్తూ మీ విలువైన సూచనను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం.. ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకు వచ్చినందుకు ధన్యవాదాలు అంటూ కేటీఆర్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

కాగా, మంత్రి కేటీఆర్ సూచనకు సానుకూలంగా స్పందించారు డీజీపీ అంజన్ కుమార్. రైల్వే, బస్టాండ్ వద్ద జీపీఎస్ ట్రాకింగ్ మెకానిజమ్ తో రాత్రి సమయంలో ఆటోలను ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలు సురక్షిత ప్రయాణం చేసేలా తగిన రవాణా సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.