12 ఏళ్ల బాలిక‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘ‌ట‌న‌పై కేటీఆర్ స్పందన

జార్ఖండ్ రాష్ట్రంలోని దుమ్కా పట్టణంలో తన ప్రేమను నిరాకరించిందని ఓ యువకుడు 19 ఏళ్ల బాలిక ఫై పెట్రోలు పోసి నిప్పటించిన ఘటన దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ ఘటన ఫై ఇప్పటికే పలువురు స్పందించగా…తాజాగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. బాలిక‌ను హ‌త్య చేసిన అత్యంత క్రూర‌మైన క్రిమిన‌ల్ షారూఖ్‌కు ఈ స‌మాజంలో స్థానం లేదన్నారు.

ఆ క్రిమిన‌ల్‌లో ఎలాంటి ప‌శ్చాత్త‌పం క‌నిపించ‌డం లేద‌న్నారు. ఐపీసీ, క్రిమిన‌ల్ ప్రోసిజ‌ర్ కోడ్‌, జువైన‌ల్ చ‌ట్టాల‌ను మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఇలాంటి నిందితుల‌కు క‌ఠిన‌మైన శిక్ష‌ల‌ను విధించాలని , నిందితులు బ‌య‌ట‌కు రాకుండా చూడాల‌న్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ఉండాలంటే బ‌ల‌మైన చ‌ట్టాలు అవ‌స‌రం అని కేటీఆర్ పేర్కొన్నారు.

దుమ్కా పట్టణానికి చెందిన 19 ఏళ్ల బాలిక కళాశాలలో 12వ తరగతి చదువుతోంది. అదే పట్టణానికి చెందిన షారుఖ్ అనే యువకుడు బాలికను ప్రేమిస్తున్నట్లు ప్రతిపాదించాడు. తన ప్రేమ ప్రతిపాదనను బాలిక తిరస్కరించిందనే కోపంతో షారూఖ్ బాలిక నిద్రిస్తున్న సమయంలో ఆమె గది కిటికీ బయట నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాధిత బాలిక 90శాతం కాలిన గాయాలతో విషమ స్థితిలో దుమ్కాలోని ఫూలో జానో మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు.