ట్విన్ టవర్స్ కూల్చివేతపై ఆనంద్ మహీంద్రా ట్వీట్

ఉత్తర్​ప్రదేశ్​లోని నోయిడాలో అక్రమంగా నిర్మించిన ట్విన్​ టవర్స్ ను ఆదివారం నేలమట్టం చేసారు. ఈ కూల్చివేతపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. దానిని మండే మోటివేషన్‌గా తీసుకున్నారు. దీనిపై నెటిజన్లు చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. “నేను నోయిడా ట్విన్ టవర్‌ల కూల్చివేతను ఎందుకు మండే మోటివేషన్‌గా తీసుకుంటున్నాను..? ఎందుకంటే ఇది మనలో పెరిగే అహంభావం వల్ల కలిగే ప్రమాదాలను నాకు గుర్తు చేస్తుంది. కొన్నిసార్లు అదనపు అహాన్ని కూల్చివేయడానికి మనకు పేలుడు పదార్థాలు అవసరం.” అని ఆయన ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌‌ను నెటిజన్లు చాలా పాజిటివ్‌గా తీసుకుంటున్నారు. చాలామంది యూజర్లు ఆ ట్వీట్‌తో ఏకీభవించారు. దేశంలోని రాజకీయ నాయకులను ప్రేరేపించడానికి మీరూ ఇలాంటి స్ఫూర్తిదాయ‌క ట్వీట్లు పెడుతూనే ఉండాల‌ని ఆనంద్ మ‌హీంద్ర‌ను ఓ నెటిజన్ కోరారు. టవర్లను కూల్చివేసేందుకు 3,700 కేజీల పేలుడు పదార్థాలను వాడారు. వాటికి రెండు వేల వరకు కనెక్షన్లు ఇచ్చారు. కూల్చివేత వల్ల సమీపంలోని భవనాలకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ భవనాల్లో ఉంటున్న వాళ్లను తాత్కాలికంగా ఖాళీ చేయించారు. చుట్టుపక్కల బిల్డింగ్స్‌ను ప్లాస్టిక్ షీట్లతో కప్పేశారు. నోయిడాలోని సెక్టార్‌ 93ఏలో ఉన్న ఈ జంట భవనాలను నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించారు. దీనిపై దగ్గర్లోని సూపర్‌టెక్‌ ఎమరాల్డ్‌ కోర్టు సొసైటీవాళ్లు 2012లో కోర్టును ఆశ్రయించారు.

దాదాపు 9 ఏళ్ల పాటు న్యాయపోరాటం కొనసాగించారు. తొలుత ఈ ప్రాంతంలో గార్డెన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని వాదించారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన అలహాబాద్‌ హైకోర్టు నిర్మాణ అనుమతుల్లో అవకతవకలు జరిగినట్లు తేల్చింది. భవనాల్ని కూల్చివేయాలని 2014లో ఆదేశించింది. తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. గత ఏడాది ఆగస్టులో అత్యున్నత న్యాయస్థానం అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సమర్థించింది. కూల్చివేతకు మూడు నెలల సమయం ఇచ్చింది. కానీ, సాంకేతికత కారణాల వల్ల ఏడాది సమయం పట్టింది.

టవర్లను కూల్చివేసేందుకు 3,700 కేజీల పేలుడు పదార్థాలను వాడారు. వాటికి రెండు వేల వరకు కనెక్షన్లు ఇచ్చారు. కూల్చివేత వల్ల సమీపంలోని భవనాలకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ భవనాల్లో ఉంటున్న వాళ్లను తాత్కాలికంగా ఖాళీ చేయించారు. చుట్టుపక్కల బిల్డింగ్స్‌ను ప్లాస్టిక్ షీట్లతో కప్పేశారు. నోయిడాలోని సెక్టార్‌ 93ఏలో ఉన్న ఈ జంట భవనాలను నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించారు. దీనిపై దగ్గర్లోని సూపర్‌టెక్‌ ఎమరాల్డ్‌ కోర్టు సొసైటీవాళ్లు 2012లో కోర్టును ఆశ్రయించారు.