ఉప్పల్‌లో చేనేత భవన నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

నేడు జాతీయ చేనేత దినోత్సం సందర్భంగా ఉప్పల్‌ శిల్పారామంలో చేనేత భవన్‌ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాన చేశారు. 500 గజాల స్థలంలో దీనిని నిర్మిస్తున్నారు. అదేవిధంగా చేనేత వస్త్రాల వ్యాపార నిర్వహణ, క్రయవిక్రయాదారుల సమావేశాలు, సదస్సుల నిర్వహణ కోసం చేనేత కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్వమించనున్నారు.

అలాగే ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు శుభవార్త తెలిపారు. మన్నెగూడ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. చేనేత కార్మికులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చేనేత మిత్ర పథకం కింద ప్రతి చేనేత కార్మికుడికి, ప్రతి మగ్గానికి 3000 రూపాయల చొప్పున వారి అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని అన్నారు. నేతన్నలకు బీమాను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.

చేనేత హెల్త్ కార్డులను కూడా ఇస్తున్నామని, అవుట్ పేషెంట్ చేనేతలకు ఇకనుండి 25 వేలు అందుతాయని తెలిపారు. కొత్త మగ్గాలకు తెలంగాణ చేనేత మగ్గం అని పేరు పెట్టామని , అలాగే టెస్కో పరిమితిని 25 వేలకు పెంచుతున్నామన్నారు.