జీహెచ్ఎంసీ స్వచ్ఛ వాహనాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ నగరంలోని సనత్ నగర్ క్రికెట్ స్టేడియంలో జీహెచ్ఎంసీ స్వచ్ఛ వాహనాలను సోమవారం ఉదయం ప్రారంభించారు. 250 స్వచ్ఛ ఆటోలను మంత్రి ప్రారంభించారు. గ్రేటర్‌లో ఇంటింటికి తిరిగి చెత్త సేకరణకు స్వచ్చ ఆటోలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే నగరంలో చెత్త సేకరణకు 3,150 స్వచ్ఛ టిప్పర్లు అందుబాటులో ఉండగా… మరో 1100 ఆటోలను జీహెచ్ఎంసీ తీసుకురానుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ శానిటేషన్ సిబ్బందికి నగరవాసుల తరపున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. సఫాయి అన్న నీకు సలాం అన్న అని అన్నది సీఎం కేసీఆర్ అని తెలిపారు. గతంలో నగరంలో 3,500 మెట్రిల్ టన్నుల చెత్త సేకరించేవారని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/