కెటిఆర్, హరీశ్, కవితల పేర్లతో బిఆర్ఎస్ చీలిపోతుందిః కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం

komatireddy-venkat-reddy

హైదరాబాద్ః మాజీ మంత్రి హరీశ్ రావును ఉద్దేశించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు చేస్తున్న వ్యాఖ్యలు కెసిఆర్, కెటిఆర్ లకు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ కెటిఆర్, హరీశ్ రావు, కవితల పేర్ల మీద విడిపోతుందని అన్నారు. బిఆర్ఎస్ మొత్తం నాలుగు ముక్కలవుతుందని చెప్పారు. సీఎం కావాలనే ప్లాన్ లో హరీశ్ ఉన్నారని అన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో మాట్లడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బిఆర్ఎస్ లో ఉన్నంత కాలం హరీశ్ రావు కనీసం ఎల్పీ లీడర్ కూడా కాలేరని వెంకటరెడ్డి అన్నారు. 20 మంది ఎమ్మెల్యేలతో ఆ పార్టీ లీడర్ కావాలని ఆయనకు మంత్రి సూచించారు. 60 కిలోల బరువున్న కెసిఆర్ పులి అయితే… 86 కిలోలు ఉన్న తాను ఏం కావాలని అన్నారు. తెలంగాణలో మరో 20 ఏళ్లు కాంగ్రెస్ దే అధికారమని చెప్పారు.