మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేటీఆర్ ఫైర్

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్రం ఖర్చు చేసే ప్రతి రూపాయిలో తెలంగాణ వాటా ఉందని..కేంద్రానికి తెలంగాణ రూపాయి ఇస్తే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి 46 పైసలు మాత్రమే వస్తున్నాయని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని పీడీఎస్ దుకాణాల వద్ద థ్యాంక్స్ టు తెలంగాణ అని బ్యానర్లు పెట్టే సమయం వచ్చిందని కేటీఆర్ ట్వీట్ చేసారు.
అంతకు ముందు కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఫై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. ఈ విషయంలో కలెక్టర్ కు మద్దతుగా నిలిచారు. కష్టపడి పనిచేసే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను ఈ రాజకీయ నాయకులు నిరుత్సాహపరుస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, గౌరవప్రదమైన ప్రవర్తనకు అభినందనలు తెలుపుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
శుక్రవారం బీర్కూర్ మండల కేంద్రంలోని ఓ రేషన్ దుకాణం వద్ద లబ్ధిదా రులతో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఎన్ని కిలోల బియ్యం ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. రేషన్ బియ్యం పథకంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? లబ్ధిదారుల వాటా ఎంత? అంటూ.. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. కేంద్రమంత్రి వరుసగా వేసిన ప్రశ్నలతో కలెక్టర్ కాస్త తడబడ్డారు. దీంతో నిర్మలా సీతారామన్ అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అమలు చేస్తున్న పథకాలపై జిల్లా పాలనాధికారికి స్పష్టత లేకపోతే ఎలా? అంటూ ప్రశ్నించారు. దీనిపై టిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా..మంత్రి కేటీఆర్ కలెక్టర్ కు మద్దతు గా నిలిచారు.