ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటా అంటున్న కృతి సనన్

వన్ నేనుఒక్కడినే మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన కృతి సనన్..తాజాగా ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం కృతి సనన్ ..ప్రభాస్ కు జోడిగా ఆదిపురుష్ మూవీ లో నటించింది. ఈ మూవీ లో ప్రభాస్ రాముడి గా , కృతి సీత పాత్రల్లో నటించారు. జూన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తాజాగా ఈ భామ నటించిన బాలీవుడ్ చిత్రం ‘భేడియా’ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదలైంది. తెలుగు లో ఈ చిత్రాన్ని ‘తోడేలు’ అనే పేరు తో విడుదల చేసారు. ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొన్న కృతిని యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్ మరియు ప్రభాస్ వీరిలో ఎవరితో మీరు ఫ్లిర్ట్ చేస్తారు..? ఎవరితో డేట్ చేస్తారు..? మరియు ఎవరిని పెళ్లి చేసుకుంటారు’ అని అడగగా..కృతి దానికి సమాధానం చెప్తూ ‘కార్తీక్ ఆర్యన్ తో ఫ్లర్టింగ్ చేస్తాను,టైగర్ తో డేటింగ్ చేస్తాను, ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.