యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట్లో విషాదం

Actor Arjun Sarja Mother Lakshmi Devamma Passed Away

సీనియర్ నటుడు , యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట్లో విషాదం నెలకొంది. అర్జున్ తల్లి లక్ష్మీదేవమ్మ (85) ఈరోజు శనివారం తుదిశ్వాస విడిచారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమెను బెంగళూరు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ వస్తున్నారు. అయితే శనివారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె పార్థివ దేహం ఆస్పత్రిలోనే ఉన్నట్లు సమాచారం. కాగా లక్ష్మి దేవమ్మ మృతి పట్ల కన్నడ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తూ అర్జున్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. లక్ష్మీదేవమ్మ మైసూర్ లో స్కూల్ టీచర్ గా పనిచేసేవారు. అర్జున్ తండ్రి శక్తి ప్రసాద్ ను వివాహం చేసుకున్న ఈమె ఇద్దరు కుమారులు. ఒక కుమార్తెకు జన్మనిచ్చారు.

అర్జున్ తన తల్లి గురించి చాలా సార్లు గొప్పగా చెప్పడం మనం చూశాం. ఆయన హీరోగా ఎదగడంలో తన తండ్రికి ఉన్న సినీ బ్యాక్ గ్రౌండ్ ప్లస్ అయినప్పటికీ.. హీరోగా స్టార్ డంని సంపాదించుకోవడానికి ఆమె తల్లి ఇచ్చి ప్రోత్సాహమే కారణమని అర్జున్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇప్పటికీ స్టార్ గా రాణించడంలో అలాగే దర్శకుడిగా కూడా సినిమాలు చేయడంలో ఆమె తల్లి ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఎక్కువని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక అర్జున్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన రవితేజ ‘ఖిలాడి’ చిత్రంతో అలరించిన ఆయన ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్ తో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఆయన డైరెక్ట్ చేస్తున్న మొదటి మూవీ ఇదే. ఈ మూవీలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య సార్జా హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం.