అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోడి
వ్యాక్సిన్ ప్రయోగాలను పరిశీలించనున్న ప్రధాని

అహ్మదాబాద్: ప్రధాని నరేంద్రమోడి కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి సమీక్షించేందుకు మూడు నగరాల పర్యటన మొదలైంది. ఈనేపథ్యంలో ఆయన ఈరోజు ఉదయం గుజరాత్‌లోని అహ్మదాబాద్ పారిశ్రామిక వాడకు చేరుకున్నారు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేస్తున్న జైడస్ కంపెనీలో ఆయన సమీక్ష నిర్వహించారు. జైడస్ కంపెనీ జైకోవ్-డీ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నది. అహ్మదాబాద్‌లో టూర్ ముగిసిన తర్వాత మోడి.. హైదరాబాద్, పుణె నగరాల్లోనూ టూర్ చేస్తారు. అక్కడ ఆయన భారత్‌బయోటెక్, సీరం సంస్థలను సందర్శించనున్నారు. కోవిడ్ టీకా రూపొందిస్తున్న ఫార్మా కంపెనీలతో ప్రధాని సంప్రదించనున్నారు. జైడస్ కాడిల్లా సంస్థ తన తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసింది. ఆ సంస్థ జైకోవీ-డీ టీకాను తయారు చేస్తున్నది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/