నేడు ఏపీ హైకోర్టు లో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ ఫై విచారణ

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు…వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ మీద నేడు ఏపీ హైకోర్టు లో విచారణ జరగనుంది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌ వెంటనే విచారించాలంటూ చంద్రబాబు తరుపు న్యాయవాదులు హౌస్ మోషన్ వేశారు.

ఈ పిటిషన్ ను దసరా సెలవుల ప్రత్యేక బెంచ్ నేడు విచారణ చేయనున్నారు. దీంతో పాటూ స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారుల కాల్ డేటా రికార్డింగ్ లను కోరుతూ బాబు తరుఫు లాయర్లు వేసిన పిటిషన్ మీద ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. దసరా సెలవు లప్రత్యేక బెంచ్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ముందు ఈ రోజు 8వ కేసుగా ఇది లిస్టింగ్ లో ఉంది. చంద్రబాబు ఆరోగ్య దష్ట్యా పిటిషన్ వేసిన లాయర్లు. చంద్రబాబుకు స్కిన్ ఎలర్జీ ఉంది… ఆయన వ్యక్తిగత వైద్యులతో చికిత్స చేయించాల్సిన అవసరం ఉంది.

అలాగే ఆయనకు కంటి సమస్యలున్నాయని పిటిషన్ లో పేర్కొన్న చంద్రబాబు న్యాయవాదులు.ఇప్పటికే చంద్రబాబుకు ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ జరిగింది. మరో కంటికి వెంటనే ఆపరేషన చేయాలని చంద్రబాబు తరుఫు న్యాయవాదులు పిటిషన్ లో మెన్షన్ చేశారు. దీంతో పాటు జైల్లో ఉండడం వలన ఆయన ఆరోగ్యం పాడయిందని.. ఇతర అనారోగ్య సమస్యలున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. వీటిని అన్నింటిని చూసి బెయిల్ ఇవ్వాలని బాబు తరువు లాయర్లు కోరుతున్నారు. మరి కోర్ట్ తీర్పు ఏమిస్తుందో చూడాలి.