తెలుగు లో కృతిశెట్టి కి ఆ హీరో అంటే ఇష్టమట

ఉప్పెన మూవీ తో ఇండస్ట్రీ కి పరిచమైన కృతి శెట్టి ..మొదటి సినిమాతోనే యూత్ ను కట్టిపడేసింది. ఈ మూవీ తర్వాత అమ్మడు చేసిన బంగార్రాజు , శ్యామ్ సింఘా రాయ్ రెండు కూడా భారీ విజయాలు సాధించాయి. దీంతో అమ్మడికి వరుస ఛాన్సులు వచ్చాయి. హ్యాట్రిక్ విజయాలను కొట్టిన కృతి..ఆ తర్వాత హ్యాట్రిక్ ప్లాప్స్ చవిచూసింది. ది వారియర్ , మాచెర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి లేటెస్ట్ గా కస్టడీ తో మరో డిజాస్టర్ అందుకుంది.

అయితే ఈ అందాల ముద్దుగుమ్మ తాజాగా చేసిన కొన్ని కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి. హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శివకార్తికేయన్ తన ఫేవరెట్ అని చెప్పుకొచ్చింది. అలాగే బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అలియా భట్ అంటే తనకు చాలా ఇష్టం అని వివరించింది. ఇక పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తనకు కాబోయే భర్తకు పెద్దగా ఆస్తి ఉండక్కర్లేదట. అలాగే పెద్దగా అందగాడు కావాల్సిన అవసరం కూడా ఏం లేదట. మంచి మనసు ఉన్నవాడైతే చాలని కృతి చెప్పుకొచ్చింది.