కృష్ణా ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం

ఆలేరు రైల్వేస్టేషన్ సమీపంలో కృష్ణ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు పెను ప్ర‌మాదం తప్పింది. ఆలేరు రైల్వేస్టేషన్ వద్ద రైలు పట్టా విరిగిపోయింది. విచిత్రంగా శబ్దం రావడంతో రైలులో ఉన్న ప్రయాణికులు అప్రమత్తం అయ్యారు. వెంటనే రైలు సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

ఈ తరుణంలోనే ట్రైన్ ఆపారు రైల్వే అధికారులు. ఆలేరు రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ పైన రైల్ పట్టా విరిగిపోవడంతో గమనించి మరమ్మతులు చేశారు అధికారులు. మరమ్మతు చేసిన తర్వాత రైలు బయలు దేరింది. ప్రయాణికులు అలర్ట్‌గా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేది. ఉదయం వేళల్లో శబ్దం రావడం కలిసి వచ్చింది. లేదంటే విరిగిన పట్టా గుర్తించడం కష్టం అయ్యేది.