కేపీహెచ్‌బీ ఏఎస్ఐ మ‌హిపాల్ రెడ్డి మృతి

పోలీస్ అధికారుల సంతాపం

ASI died while receiving treatment
ASI Mahipal Reddy

Hyderabad:  డ్యూటీ లో గాయ‌ప‌డిన కేపీహెచ్‌బీ ఏఎస్ఐ మ‌హిపాల్ రెడ్డి మృతి చెందారు ఈ నెల 27న నిజాంపేట రోడ్‌లో ఏఎస్ఐ మ‌హిపాల్ రెడ్డి, డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు నిర్వ‌హించారు. మ‌ద్యం మ‌త్తులో ఉన్న క్యాబ్ డ్రైవ‌ర్ ఆయన్ని ఢీకొట్టాడు. దీంతో ఏఎస్ఐ తీవ్రంగా గాయపడ్డారు. ఆయ‌న‌ను చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉద‌యం మ‌హిపాల్ రెడ్డి క‌న్నుమూశారు. మ‌హిపాల్ రెడ్డి మృతికి పోలీస్ అధికారులు సంతాపం ప్ర‌క‌టించారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/