‘బుల్లెట్టు బండి’ వధువు జాక్ పాట్ కొట్టేసింది

‘బుల్లెట్టు బండి’ ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఎక్కడ చూసిన..ఏ వేడుక లో విన్న ..ఏ బరాత్‌లో చూడు ఈ సాంగే వినిపిస్తుంది. అంతలా ఈ సాంగ్ వైరల్ కావడానికి కారణం ఓ పెళ్లి వధువు ఈ సాంగ్ కు అదిరిపోయే డాన్స్ వేయడమే. వాస్తవానికి ఈ సాంగ్ విడుదలై చాల రోజులే అవుతున్నప్పటికీ ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ సాంగ్ కు ఈ వధువు డాన్స్ చేసిందో..ఆ క్షణం నుండి ఈ సాంగ్ పాపులర్ అయ్యింది.

ఈ డాన్స్ వీడియో కు సోషల్‌వీడియోలో మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడంతో ఆ నూతన జంట ఒక్కసారిగా సెలబ్రెటీ కపుల్‌గా మారిపోయారు. అయితే ఇప్పుడు ఈ వధువు జాక్ పాట్ కొట్టేసినట్లు తెలుస్తుంది. ‘బుల్లెట్టు బండి’ ఆ పాటను నిర్మించిన సంస్థ తమ తదుపరి పాటకు డ్యాన్స్‌ చేసే అవకాశం వధువు కు ఇచ్చారట.

‘బుల్లెట్టు బండి’ పాటను బ్లూ రాబిట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే సంస్థ రూపొందించింది. ఇప్పుడు ఆ సంస్థ తమ కొత్త పాటలో డాన్స్ చేసే అవకాశం నూతన వధువు కు కల్పించారట. ఇప్పటికే ఆమెతో ఫోన్‌లో మాట్లాడడం..ఆమె సరే అనడం జరిగిపోయింది. ఊహించని రీతిలో తనకు దక్కిన అవకాశంతో ఆ వధువు ఆనందంతో గంతులేస్తుంది.

https://youtube.com/watch?v=994lhMQqI7Y