సొంత పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

వైస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించిన కోటంరెడ్డి..మరోసారి అధిష్ఠానంపై తన అసంతృప్తి ని వ్యక్తం చేసారు. తన సోదరుడు గిరిధర్ రెడ్డి వైస్సార్సీపీ తరపున పోటీ చేస్తే తాను ఎన్నికల బరిలో నిలబడనని తెలిపారు. తన తమ్ముడికి పోటీగా తాను నిలబడనని అన్నారు. తన తమ్ముడిని తనపై పోటీకి నిలబడేలా రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఈ పరిస్థితి కొనసాగితే రాజకీయాలకు గుడ్ బై చెపుతానని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ పై తన మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో అవమానాలను భరించలేనని కోటంరెడ్డి అన్నారు. ప్రస్తుతం కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చ గా మారాయి.

ఇక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2014, 2019లో వైస్సార్సీపీ తరఫున పోటీచేసి నియోజకవర్గంలో తనకెవరూ పోటీలేరన్నట్లుగా జనాల్లో ఎదిగారు. మంత్రివర్గ విస్తరణలో కోటంరెడ్డి పేరు కూడా గట్టిగానే వినిపించింది. ఆయన అభిమానులు, అనుచరులంతా పండుగ చేసుకున్నారు. ఏం జరిగిందో ఏమో కానీ చివరికి లిస్ట్‌లో పేరు రాలేదు. ఆ తర్వాత కూడా ఎక్కడ నిరాశ చెందకుండా ప్రజలకు ఏ అవసరం ఉన్న పరుగుపరుగున వెళ్లి వారి సమస్య ను తీర్చే వారు. అలాంటి వారు ఇప్పుడు అధిష్టానం ఫై అసంతృప్తి తో ఉన్నారంటే..ఆయన్ను అధిష్టానం ఎంత వరకు పట్టించుకుంటుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈయన వైస్సార్సీపీ కి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.