ఏపీ క్రీడల శాఖ మంత్రి రోజాకు అరుదైన గుర్తింపు

ఏపీ క్రీడల శాఖ మంత్రి రోజాకు అరుదైన గుర్తింపు లభించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో సభ్యురాలిగా నియమితులయ్యారు. రోజాతో పాటు మరో నాలుగు రాష్ట్రాల క్రీడా శాఖ మంత్రులకు కూడా సాయ్ సభ్యులుగా అవకాశం లభించింది. సాయ్ లో రోజా దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ మేరకు కార్యదర్శి జతిన్ నర్వాల్ పేర్కొన్నారు. సాయ్ లో తనకు సభ్యత్వం లభించడంపై రోజా స్పందించారు. అరుదైన అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. మెరుగైన రీతిలో సేవలు అందిస్తానని పేర్కొన్నారు.

ఇక రోజా విషయానికి వస్తే హీరోయిన్ గా వెండితెర ఫై రాణించిన ఈమె..ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఓ పక్క రాజకీయాల్లో ఉంటూనే సినిమాల్లో , బుల్లితెర ఫై కనిపిస్తూ వస్తుంది. నగరి నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ్యురాలిగా ఎన్నికైంది. 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా సీఎం జగన్..రోజాకు మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చారు. టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. ప్రస్తుతం ఏపీ క్రీడల శాఖ, పర్యాటక శాఖ మంత్రి గా కొనసాగుతుంది.