శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేయనున్న సిఎంలు

AP, Karnataka CMs for Srivari Brahmotsavam

తిరుమల: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఏపి సిఎం జగన్‌, కర్ణాటక సిఎం యడియూరప్ప విచ్చేయనున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా రెండు రోజులు పాటు తిరుమలలోనే జగన్ ఉండనున్నారు. 23వ తేది సాయంత్రం తిరుమలకు సిఎం చేరుకోనున్నారు. గరుడ సేవ సందర్భంగా 23 సాయంత్రం శ్రీవారికి సిఎం జగన్ పట్టువస్ర్తాలను సమర్పించనున్నారు. 24న ఉదయం జగన్.. శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శనాంతరం నాదనీరాజనం మండపంలో నిర్వహిస్తూన్న సుందరకాండ పారాయణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొనున్నట్లు సమాచారం. అనంతరం కర్ణాటక అతిధి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో ఇరువురు సిఎం పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి పద్మావతి అతిథి గృహంకు చేరుకోని అల్పాహారం స్వీకరించి జగన్ తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/